బాబ్రీ మసీదు తీర్పుపై హైకోర్టుకు వెళ్తాంః ముస్లిం లా బోర్డు

|

Sep 30, 2020 | 9:14 PM

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది.

బాబ్రీ మసీదు తీర్పుపై హైకోర్టుకు వెళ్తాంః ముస్లిం లా బోర్డు
Follow us on

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోసీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బీజేపీ అగ్రనేతలతో సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీంతో తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ముస్లిం సంస్థలతో కలిసి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి చెప్పారు.

మరోవైపు దీనిపై కచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్‌యాబ్ జిలానీ కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో 300 మందికి పైగా సాక్ష్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది కోర్టు. నిందితులు స్టేజీపై కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు సాక్ష్యం ఇచ్చారని, సీబీఐ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. బాబ్రీ కూల్చివేతకు పాల్పడ్డారని సీబీఐ కోర్టు తన తీర్పులో పేర్కొనడం సరికాదన్నారు. అసలు నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని అన్నారు.