AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ఇలా ఉండబోతున్నాయి…

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ఇలా ఉండబోతున్నాయి...
Balaraju Goud
|

Updated on: Sep 30, 2020 | 8:54 PM

Share

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు,స్విమ్మింగ్ పూల్స్‌కు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మూతపడ్డ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తిరిగి తెరిచేందుకు అవకాశం కల్పించారు. కొత్త నిబంధనల ప్రకారం 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.విద్యాసంస్థలు తెరిచే విషయంలో రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విభాగాలకు విడిచి పెట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే, 15 నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు తెరిచేందుకు అనుమతినిచ్చింది. స్టేడియంల్లో క్రీడాకారుల శిక్షణ పొందేందుకు వెసులుబాటు కల్పించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి ఉండగా, 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రం. అటు అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చసింది కేంద్రం.

Follow Us
ఉపవాసం పేరుతో సగ్గుబియ్యం అతిగా తింటున్నారా?.. వీరికి డేంజర్
ఉపవాసం పేరుతో సగ్గుబియ్యం అతిగా తింటున్నారా?.. వీరికి డేంజర్
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు.. ఆర్బీఐ నుంచి అప్డేట్
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు.. ఆర్బీఐ నుంచి అప్డేట్
9,700తో అయోధ్య రామ్ లల్లా దర్శనం.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..
9,700తో అయోధ్య రామ్ లల్లా దర్శనం.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా
భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ..
కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ..
బెండకాయ పచ్చడి ఇలా చేసి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే..
బెండకాయ పచ్చడి ఇలా చేసి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే..
సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి
సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి
ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా..
ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా..
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు