AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో అరుదైన ఘట్టం..! ఒకే కల్యాణ మండపంలో హిందూ, ముస్లిం పెళ్లి వేడుకలు..

రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధువు బంధువు శాంతారామ్ కవాడే తెలిపారు. మంగళాష్టకం, సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం అనంతరం రెండు వర్గాల ప్రజలు కలిసి భోజనం చేశారు. ఈ దృశ్యం పరస్పర సామరస్యం, సామాజిక ఐక్యతకు ఉదాహరణగా మారింది. మతం కారణంగా..

ఇదో అరుదైన ఘట్టం..! ఒకే కల్యాణ మండపంలో హిందూ, ముస్లిం పెళ్లి వేడుకలు..
Hindu And Muslim Wedding
Jyothi Gadda
|

Updated on: May 22, 2025 | 9:58 PM

Share

మతాల మధ్య సామరస్యాన్ని అద్భుతంగా ప్రదర్శించే ఒక సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా చిక్కుల్లో పడ్డ హిందూ కుటుంబానికి ఒక ముస్లిం కుటుంబం సహాయం చేసింది. పూణేలోని వనవాడి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వర్షం కారణంగా హిందూ జంట వివాహం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. సంస్కృతి కవాడే, నరేంద్ర గలాండేల జంట వివాహం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బహిరంగ పచ్చిక బయళ్లలో జరగాల్సి ఉంది. కానీ, చివరి క్షణంలో భారీ వర్షం వల్ల మండపం తడిసి ముద్దయింది. దీంతో మొత్తం ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి. ఇంతలో.. సమీపంలోని ఒక హాలులో ఓ ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతోంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు.

ముస్లిం కుటుంబం ఎటువంటి సంకోచం లేకుండా దాదాపు గంటసేపు వేదికను ఇచ్చింది. రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధువు బంధువు శాంతారామ్ కవాడే తెలిపారు. మంగళాష్టకం, సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం అనంతరం రెండు వర్గాల ప్రజలు కలిసి భోజనం చేశారు. ఈ దృశ్యం పరస్పర సామరస్యం, సామాజిక ఐక్యతకు ఉదాహరణగా మారింది. మతం కారణంగా సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ ఇలాంటి సంఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది.

వర్షం ఒక వివాహానికి అంతరాయం కలిగించి ఉండవచ్చు. కానీ, ఈ సహాయం కొత్త సంబంధాన్ని సృష్టించింది. ఈ సంఘటన గురించి పూణేలోని ప్రజలలో సానుకూల చర్చ జరుగుతోంది. విభిన్న విశ్వాసాలకు చెందిన రెండు జంటలు వారి ప్రత్యేక రోజున ఒకే వేదికను పంచుకున్నారు. ఇది సామరస్యం, మానవత్వాన్ని గుర్తు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..