ఆకాశంలో అద్భుతం! నిప్పులు చిమ్ముతూ క‌నిపించిన‌ ఉల్క‌..

ఆకాశంలో అద్భుతం! నిప్పులు చిమ్ముతూ క‌నిపించిన‌ ఉల్క‌..

ఆకాశంలో ఎప్పుడూ ఏదో ఒక అద్బుతం జ‌రుగుతూనే ఉంటుంది. కానీ వాటిని క‌ళ్లారా చూసే వాళ్లు ఎంత మంది. బిజీ లైఫ్ కార‌ణంగా ఎన్నో ప్ర‌కృతి అద్భుతాల్ని, వింతల్ని చూసే అవ‌కాశం మ‌నిషి మిస్ అవుతున్నాడు. ఇక తాజాగా మెక్సికోలోని తావోస్‌లో ఉల్కాపాతం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో మ్యుజీషియ‌న్ అంబెర్ క‌ఫ్మాన్‌కి...

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 01, 2020 | 7:18 PM

ఆకాశంలో ఎప్పుడూ ఏదో ఒక అద్బుతం జ‌రుగుతూనే ఉంటుంది. కానీ వాటిని క‌ళ్లారా చూసే వాళ్లు ఎంత మంది. బిజీ లైఫ్ కార‌ణంగా ఎన్నో ప్ర‌కృతి అద్భుతాల్ని, వింతల్ని చూసే అవ‌కాశం మ‌నిషి మిస్ అవుతున్నాడు. ఇక తాజాగా మెక్సికోలోని తావోస్‌లో ఉల్కాపాతం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో మ్యుజీషియ‌న్ అంబెర్ క‌ఫ్మాన్‌కి ఓ ఉల్క క‌నిపించింది. అది ఆకాశంలో అలా వెళ్తుంటే.. ఒక్క‌సారిగా షాక్ అవుతూ వీడియో తీశారు. త‌న జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడ‌లేద‌ని, ఇదో అద్భుత‌మ‌నీ చెబుతూ అంబెర్ ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది. సాధార‌ణంగా ఉల్క‌లు ఇంత స్ప‌ష్టంగా క‌నిపించ‌వు. కానీ ఈ వీడియోలు మాత్రం ఆ ఉల్క నిప్పులు చిమ్ముతూ.. వేగంగా దూసుకెళ్లింది. కాగా ఈ వీడియోకు సంబంధించి నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

బిగ్ బ్రేకింగ్ః క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

విశాఖ ‘షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌టన’‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu