AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ దారుణం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి…!

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు కేవలం కొన్ని రోజుల్లోనే ఛేదించారు. అక్రమ సంబంధం, పాత కక్షల నేపథ్యంలో యూట్యూబ్ వీడియోలు చూసి పక్కా స్కెచ్‌తో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు నిందితుడు మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ దారుణం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి...!
Jammikunta Crime
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 12:11 PM

Share

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు కేవలం కొన్ని రోజుల్లోనే ఛేదించారు. అక్రమ సంబంధం, పాత కక్షల నేపథ్యంలో యూట్యూబ్ వీడియోలు చూసి పక్కా స్కెచ్‌తో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు నిందితుడు మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హుజురాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు మహేష్‌కు ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. అయితే, మృతుడు మొగిలి సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో గతంలో మహేష్, ఆ మహిళ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొగిలి జైలుకు కూడా వెళ్లాడు. అయితే, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మొగిలి మారలేదు. నిందితుడు మహేష్‌ను, ఆ మహిళను సమాజంలో కించపరుస్తూ, తీవ్రంగా అవమానించాడు. ఈ అవమాన భారంతోనే మొగిలిని అంతమొందించాలని మహేష్ నిశ్చయించుకున్నాడు.

యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. దారుణం..!

హత్య చేయడానికి ముందు నిందితుడు మహేష్ తన మొబైల్ ఫోన్‌లో “హత్య ఎలా చేయాలి?” అని యూట్యూబ్‌లో పలు వీడియోలను సెర్చ్ చేసి చూశాడు. ఆ వీడియోల ద్వారా పక్కా ప్లాన్ వేసుకుని, సమయం చూసి మొగిలిపై ఇనుప రాడ్డుతో తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మొగిలి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, మహేష్ మొబైల్ ఫోన్, మరియు క్రైమ్ సీన్ నుండి పారిపోవడానికి వాడిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us