AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్ల పారాణి ఆరకముందే వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి

పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే హనుమకొండ జిల్లాలో నవవరుడు, అతని తండ్రి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. భీమారంలో ఇంటికి ఏర్పాటు చేసిన అలంకరణ లైట్లను తాకి తండ్రి సాంబయ్య విద్యుత్ ఘాతానికి గురికాగా, కాపాడేందుకు వెళ్లిన నవవరుడు శరత్ కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాళ్ల పారాణి ఆరకముందే వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
Hanamkonda Tragedy
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 10:51 AM

Share

పెళ్ళై వారం రోజులు తిరగక ముందే నవవరుడు అతని తండ్రి ప్రాణాలు కోల్పోయిన సంఘటన హనుమకొండ జిల్లాలో విషాదాన్ని నింపింది.. పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి అలంకరించిన విద్యుత్ దీపాల వైర్లు తగిలి వరుడి తండ్రి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో నవవరుడు కూడా నిండు ప్రాణాలు కోల్పోయాడు.. కాళ్ల పారాణి ఆరకముందే వారిని మృత్యువు వెంటాడింది. ఈ విషాద సంఘటన హనుమకొండ లోని భీమారంలో జరిగింది.. సాంబయ్య – రమాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.. చిన్న కొడుకు శరత్ కుమార్ హైదరాబాదులో సిఏగా విధులు నిర్వహిస్తున్నాడు.. ఇతనికి జూన్ 24వ తేదీన వివాహం జరిగింది.

పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి లైటింగ్ అమర్చారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వరుడి తండ్రి సాంబయ్య ఇంటిపైకి వెళ్లి అకస్మాత్తుగా విద్యుత్ లైట్లు తాకాడు.. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై అక్కడే పడిపోయాడు.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో వరుడు శరత్ కుమార్ కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు..

ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. ఇద్దరి డెడ్ బాడీలను ఎంజీఎం ఆసుపత్రి మార్చడానికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

పెళ్లయి వారం రోజులు కూడా గడవకముందే నవవరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.. నవవధువు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో బీమారంలో తీవ్ర విషాదం నెలకొంది.

వీడియో చూడండి..

Follow Us
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం