ఎన్డీఆర్ఎఫ్ దళాల సేవలు మరువలేనివి.. కేంద్రమంత్రి అమిత్ షా ట్వీట్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడటంలో ఎన్డీఆర్ఎఫ్ దళాల సేవలపై కేంద్ర మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా ఆయన రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్‌లో 700 మంది ప్రయాణికులను సహాయక బృందాలు రక్షించాయి. ప్రమాదంలో చిక్కుకున్న సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షించామన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అమిత్ షా షేర్ చేశారు. ఇప్పటి వరకు రక్షించిన […]

ఎన్డీఆర్ఎఫ్ దళాల సేవలు మరువలేనివి.. కేంద్రమంత్రి అమిత్ షా ట్వీట్

Edited By:

Updated on: Jul 27, 2019 | 8:15 PM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడటంలో ఎన్డీఆర్ఎఫ్ దళాల సేవలపై కేంద్ర మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా ఆయన రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్‌లో 700 మంది ప్రయాణికులను సహాయక బృందాలు రక్షించాయి. ప్రమాదంలో చిక్కుకున్న సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షించామన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అమిత్ షా షేర్ చేశారు. ఇప్పటి వరకు రక్షించిన ప్రయాణికులను కొల్హాపూర్‌కు పంపించనున్నట్టుగా అధికారులు తెలిపారు.