ముగ్గురు కాంగ్రెస్ నేతలను కిడ్నాపర్లనుకుని..

మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లాలో.. నవల్ సింహ్ అనే గ్రామమది. గురువారం రాత్రి ముగ్గురు కాంగ్రెస్ నాయకులు కారులో ప్రయాణిస్తుండగా.. పిల్లలను అపహరించుకుపోయే ముఠా సభ్యులనుకుని వారిని గ్రామస్తులు చితకబాదారు. ధర్మేంద్ర శుక్లా, ధర్ముసింగ్ లాంజీవర్, లలిత్ భాస్కర్ అనే ఈ కాంగ్రెస్ నేతల కారుకు అడ్డుగా వారు చెట్ల కొమ్మలను విరిచి రోడ్డుపై వేశారు. తమను దోచుకునేందుకు దొంగలే ఈ పని చేసి ఉంటారని భావించి ఈ కాంగ్రెస్ నాయకులు కారు దిగగానే గ్రామస్తులు దాడికి […]

  • Anil kumar poka
  • Publish Date - 5:42 pm, Sat, 27 July 19
ముగ్గురు కాంగ్రెస్ నేతలను కిడ్నాపర్లనుకుని..

మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లాలో.. నవల్ సింహ్ అనే గ్రామమది. గురువారం రాత్రి ముగ్గురు కాంగ్రెస్ నాయకులు కారులో ప్రయాణిస్తుండగా.. పిల్లలను అపహరించుకుపోయే ముఠా సభ్యులనుకుని వారిని గ్రామస్తులు చితకబాదారు. ధర్మేంద్ర శుక్లా, ధర్ముసింగ్ లాంజీవర్, లలిత్ భాస్కర్ అనే ఈ కాంగ్రెస్ నేతల కారుకు అడ్డుగా వారు చెట్ల కొమ్మలను విరిచి రోడ్డుపై వేశారు. తమను దోచుకునేందుకు దొంగలే ఈ పని చేసి ఉంటారని భావించి ఈ కాంగ్రెస్ నాయకులు కారు దిగగానే గ్రామస్తులు దాడికి యత్నించారు. వారి కారును ధ్వంసం చేశారు. . భయంతో ఆ ముగ్గురూ పోతుండగా..స్థానికులు పట్టుకుని చావబాదారు. తాము ఒక పార్టీకి చెందినవారిమని, తమను వదిలేయాలని వారు ఎంతగా ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్థులు వారి మాటలు నమ్మలేదు. చివరకు తెల్లవారాక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను రక్షించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల తమ గ్రామంలో పిల్లలను అపహరించుకుపోయే కిడ్నాపర్లు ఎక్కువయ్యారన్న వదంతుల ఫలితంగానే గ్రామస్థులు పొరబడి.. ఈ దాడికి పాల్పడ్డారని ఖాకీలు చెబుతున్నారు.