ఆంధ్రాబ్యాంక్ పేరు కొనసాగించండి : కేంద్రానికి కేవీపీ లేఖ
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్న కేంద్రం నిర్ణయంపై ఏపీనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంకు పేరు కనుమగురు కానున్న నేపథ్యంలో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఓ లేఖను రాశారు. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆంధ్రాబ్యాంకు పేరు మార్చవద్దంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. బ్యాంకులు విలీనం తప్పనిసరి అని […]
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్న కేంద్రం నిర్ణయంపై ఏపీనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంకు పేరు కనుమగురు కానున్న నేపథ్యంలో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఓ లేఖను రాశారు. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆంధ్రాబ్యాంకు పేరు మార్చవద్దంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. బ్యాంకులు విలీనం తప్పనిసరి అని భావిస్తే ఆంధ్రాబ్యాంకు పేరు అలాగే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ బ్యాంకు స్వాతంత్రానికి ముందు నుంచి తెలుగువారికి సేవలు అందించిందని కేవీపీ తెలిపారు. ఆంధ్రాబ్యాంకు తెలుగువారి బ్యాంక్ అని 96 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ బ్యాంకు సేవల్ని గుర్తించి పేరు మార్చవద్దంటూ కేవీపీ విఙ్ఞప్తి చేశారు.