mp komatireddy venkatreddy letter to cm kcr: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆపి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని విమర్శించారు. సీఎం తప్పుడు నిర్ణయాలతో లక్షలాది కార్మికులు పస్తులుంటున్నారని ఆరోపించారు. ధరణి వెబ్‌సైట్ ప్రజలకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. పాత పద్ధతిలో వారసత్వ మార్పిడి ఉచితంగా చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గినట్లే ఎల్‌ఆర్‌ఎస్‌ను సైతం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో పేదలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.