మొత్తానికి.. ఇవాళ థియేటర్లు ఓపెన్ కాలేదన్నమాట.!
కేంద్రం ఓకే చెప్పినా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. అన్ లాక్ 5.0 లో భాగంగా నేటి నుంచి (15వ తేదీ) సినిమా హాళ్ళకు 50 శాతం అక్యుపెన్సితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో.. తెలంగాణలో థియేటర్లు తెరవలేదు. అయితే, సినిమా థియేటర్స్ తెరిచేందుకు తెలంగాణా థియేటర్ ఓనర్స్ సుముఖంగా వున్నారు. తెలంగాణాలో సినిమా హాళ్లు […]
కేంద్రం ఓకే చెప్పినా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. అన్ లాక్ 5.0 లో భాగంగా నేటి నుంచి (15వ తేదీ) సినిమా హాళ్ళకు 50 శాతం అక్యుపెన్సితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో.. తెలంగాణలో థియేటర్లు తెరవలేదు. అయితే, సినిమా థియేటర్స్ తెరిచేందుకు తెలంగాణా థియేటర్ ఓనర్స్ సుముఖంగా వున్నారు. తెలంగాణాలో సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని థియేటర్స్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఏపీలో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. సినిమా హాళ్లు తెరిచేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్స్ తెరిచేందుకు సినిమా హాల్ ఓనర్స్ సుముఖంగా లేరు. అయితే, ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకుంటే మాత్రం సినిమా హాళ్లు తెరుస్తామంటున్నారు థియేటర్స్ ఓనర్స్. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు కొనసాగడంతో సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు.