హైదరాబాద్: ఫుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తమ వంతు సహయాన్ని అందించేదందుకు ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముందుకొచ్చింది. 5 లక్షల రూపాయల విరాళాన్ని ‘మా’ తరుపున ప్రకటించింది. ఈమేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ నరేష్ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమరులైను జవాన్ల కుటుంబాలను ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. అమరులు కుటుంబాలను ఆదుకునేందుక దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ముందుకొస్తున్న విషయం తెలిసిందే.