AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. మాతృభాష చదవాల్సిందేనట.!

Mother Tongue Mandatory For Government Jobs: ఈ మధ్యకాలంలో విద్యార్థులు తమ మాతృభాషను మర్చిపోతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే స్థానిక అస్సామీ భాష 10వ తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అటు లోయ ప్రాంతంలోని బోడోల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అటానమస్‌ జిల్లాల్లోనూ అక్కడి స్థానిక […]

ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. మాతృభాష చదవాల్సిందేనట.!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 27, 2020 | 10:15 PM

Share

Mother Tongue Mandatory For Government Jobs: ఈ మధ్యకాలంలో విద్యార్థులు తమ మాతృభాషను మర్చిపోతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే స్థానిక అస్సామీ భాష 10వ తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అటు లోయ ప్రాంతంలోని బోడోల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అటానమస్‌ జిల్లాల్లోనూ అక్కడి స్థానిక భాష బెంగాలీ, బోడోలు తప్పకుండా 10వ తరగతి వరకు అభ్యసించాలని ప్రకటించారు. ఇక దీనిపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. బడ్జెట్ సమావేశాల సమయంలో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. తన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నారని.. అందువల్ల వారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హలని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు విద్యా వ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ స్పష్టం చేశారు. సుమారు 24,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్‌కు నాలుగు జతల యూనిఫాంలను.. అలాగే 9,10 తరగతి విద్యార్థులకు రెండు జతలను ప్రభుత్వం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.