AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: సీఏఏపై స్టేకు సుప్రీం నో

దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న సిటిజెన్షిప్ అమెండ్‌మెంట్ యాక్టు అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా సుమారు 143 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సీఏఏ అమలుపై స్టే విధించేందుకు విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు అయిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీఏఏను […]

Breaking: సీఏఏపై స్టేకు సుప్రీం నో
Rajesh Sharma
|

Updated on: Jan 27, 2020 | 12:34 PM

Share

దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న సిటిజెన్షిప్ అమెండ్‌మెంట్ యాక్టు అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా సుమారు 143 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సీఏఏ అమలుపై స్టే విధించేందుకు విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు అయిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీఏఏను లౌకికతత్వానికి వ్యతిరేకంగా అభివర్ణించిన పిటిషన్‌దారులు.. చట్టం అమలుపై తక్షణం స్టే విధించాలని కోరారు. స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అంతకముందు.. వివాదాస్పదమైన సీఏఏని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో మొత్తం 144 పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వీటిని విచారించింది. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతున్న పిటిషన్లే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం లీగల్ కాదని, మౌలిక రాజ్యాంగ వ్యవస్థకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. జనవరి 10న అమలులోకి తెచ్చిన ఈ చట్టాన్ని అమలుకాకుండా స్తంభింపజేయాలని కూడా కొందరు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతో బాటు డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయుఎంఎల్, ఎంఐఎం సహా.. నటుడు కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి.

సవరించిన పౌరసత్వ చట్టం రాజ్యాంగబధ్దమైనదేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు జనవరి 9 న నిరాకరించింది. దేశం వివిధ సమస్యలను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం శాంతి నెలకొనేలా చూడాల్సి ఉందని న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టం చెల్లుబాటును కోర్టు నిర్ణయించాల్సి ఉంది తప్ప.. ఇదిరాజ్యాంగ బధ్దమేనని ప్రకటించడానికి కాదని పేర్కొంది.