భర్త మందలించాడని ఏడాదిన్నర బాలుడితో భార్య ఆత్మహత్య

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మందలించాడని మనస్తాపంతో ఒకటిన్నరేళ్ల కుమారుడితో తల్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

భర్త మందలించాడని ఏడాదిన్నర బాలుడితో భార్య ఆత్మహత్య
Follow us

|

Updated on: Sep 13, 2020 | 1:33 PM

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మందలించాడని మనస్తాపంతో ఒకటిన్నరేళ్ల కుమారుడితో తల్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.. స్థానిక పుళల్‌ సమీపం కన్నడ పాళయం జీవా 2వ వీధికి చెందిన రంజిత్‌కుమార్‌ పుళల్‌లో ఉన్న లారీ బుకింగ్‌ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన రెడ్‌హిల్స్‌ సమీపం సామియార్‌మఠంకు చెందిన భాగ్యలక్ష్మి(22)ని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి మిత్రన్‌ అనే ఒకటిన్నరేళ్ల బాలుడు కూడా జన్మించాడు. రెండ్రోజుల క్రితం అల్లరి చేస్తున్నాడంటూ భాగ్యలక్ష్మి కుమారుడిని కొట్టింది. దీంతో ఆగ్రహించిన రంజిత్‌కుమార్‌ భార్యను కొట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం రంజిత్‌కుమార్‌ విధులకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్తకు ఫోన్‌ చేసిన భాగ్యలక్ష్మికి భర్త రంజిత్ దురుసుగా సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మీ తల్లి శాంతి ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఇంట్లోకి వెళ్లిన భాగ్యలక్ష్మీ తలుపులు మూసి ఉండడం, ఎంత పిలిచినా సమాధానం లేకపోవడంతో అనుమానించిన తల్లి శాంతి ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లింది. అంతలోనే మిత్రన్‌తో పాటు భాగ్యలక్ష్మి ఉరేసుకొని విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు పుళల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..