AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మహమ్మారిపై.. మోదీ ప్రభుత్వ చర్యలకు భారీ మద్దతు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని గట్టెక్కిస్తుందని 93.5% భారతీయులు విశ్వాసంతో ఉన్నారు.

కరోనా మహమ్మారిపై.. మోదీ ప్రభుత్వ చర్యలకు భారీ మద్దతు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 9:05 PM

Share

Narendra Modi: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని గట్టెక్కిస్తుందని 93.5% భారతీయులు విశ్వాసంతో ఉన్నారు. ముప్పు నుంచి దేశం సమర్థంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారని గురువారం విడుదలైన ఓ సర్వే తెలిపింది.

కాగా.. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మార్చి 25న మొదట 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత దానిని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ అమలు చేసిన తొలిరోజు ప్రధాని మోదీపై 76.8% ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటర్‌ సర్వే పేర్కొంది. ఏప్రిల్‌ 21న ఆ సంఖ్య 93.5 శాతానికి చేరిందని వెల్లడించింది. ‘కరోనా వైరస్‌ సంక్షోభాన్ని భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదా’ అని మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 21 వరకు ప్రజలను సర్వే ద్వారా ప్రశ్నించారు.

Also read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: గత 20 ఏళ్లలో.. ఎన్నడూ లేనంతగా తగ్గిన వాయు కాలుష్యం..