లాక్‌డౌన్ ఎఫెక్ట్: గత 20 ఏళ్లలో.. ఎన్నడూ లేనంతగా తగ్గిన వాయు కాలుష్యం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ పుణ్యమా అని ఉత్తర భారతదేశంలో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఉత్తర భారతదేశంలో

లాక్‌డౌన్ ఎఫెక్ట్: గత 20 ఏళ్లలో.. ఎన్నడూ లేనంతగా తగ్గిన వాయు కాలుష్యం..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 7:41 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ పుణ్యమా అని ఉత్తర భారతదేశంలో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఉత్తర భారతదేశంలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతంగా వాయు కాలుష్యం తగ్గిందని పేర్కొంది. యూనివర్సిటీస్ స్పేస్ రీసెర్చ్ అసోసియేషన్ (యూఎస్ఆర్ఏ) శాస్త్రవేత్త పవన్ గుప్తా, మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని నాసా బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

కాగా.. కోవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మానవ కార్యకలాపాలు తగ్గాయని, ఫలితంగా ఉత్తర భారతదేశంలోని గాలిలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని పేర్కొంది. నాసా ఉపగ్రహాల డేటా విశ్లేషించినప్పుడు ఈ విషయం స్పష్టమైందని యూఎస్ఆర్ఏ తెలిపింది. ఉత్తర భారతదేశంలో మార్చి 27న చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని, ఫలితంగా గాల్లోని కాలుష్య కణాలు తగ్గిపోయాయని గుప్తా తెలిపారు.

Also Read: కరోనా కట్టడికి.. మూలకణ చికిత్స..!