సీఎం అందుకే లిక్క‌ర్ ధ‌ర‌లు పెంచారు : రోజా

|

May 04, 2020 | 4:51 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లిక్క‌ర్ విక్ర‌యాలు, ధరల పెంపు వ్యవహారంపై అధికార‌, ప్రతిప‌క్షాల మధ్య ఫైట్ న‌డుస్తోంది. కరోనా తీవ్ర‌త పెరుగుతోన్న‌ సమయంలో మ‌ద్యం షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. షాపుల వ‌ద్ద భౌతిక‌ దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార వైసీపీ అంతే స్థాయిలో కౌంట‌ర్లు ఇస్తోంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత‌ల‌పై ఫైర‌య్యారు. ధరలు పెంచితే బ‌డుగు […]

సీఎం అందుకే లిక్క‌ర్ ధ‌ర‌లు పెంచారు : రోజా
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లిక్క‌ర్ విక్ర‌యాలు, ధరల పెంపు వ్యవహారంపై అధికార‌, ప్రతిప‌క్షాల మధ్య ఫైట్ న‌డుస్తోంది. కరోనా తీవ్ర‌త పెరుగుతోన్న‌ సమయంలో మ‌ద్యం షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. షాపుల వ‌ద్ద భౌతిక‌ దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార వైసీపీ అంతే స్థాయిలో కౌంట‌ర్లు ఇస్తోంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత‌ల‌పై ఫైర‌య్యారు.

ధరలు పెంచితే బ‌డుగు వర్గాలు మద్యానికి దూరం అవుతారని ఉద్దేశంతోనే జ‌గ‌న్ స‌ర్కార్ రేట్లు పెంచిందన్నారు రోజా. మ‌ద్యపాన నిషేధంలో భాగంగా సీఎం జ‌గ‌న్ ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నార‌ని తెలిపారు. మద్యం రేట్లు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు ఇబ్బందిప‌డుతున్నార‌ని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు లిక్క‌ర్ ఏరులై పారిస్తే.. జగన్ ప్ర‌భుత్వం దశలవారీగా మద్య నిషేధం చేస్తోందన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 40 వేల బెల్టుషాపులు, 40 శాతం బార్లు, 20 శాతం వైన్‌ షాపులు జ‌గ‌న్ తొలగించారన్న విషయాన్ని గుర్తు ఉంచుకోవాల‌న్నారు రోజా. కరోనా కట్టడికి ముఖ్య‌మంత్రి జగన్‌ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ఫైర‌య్యారు.