నా లవ్ మొదలయ్యింది ఇక్కడే..!

ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభూతులకు వేదికయ్యింది భీమిలి ఉత్సవాలు. సముద్ర తీరాన అత్యంత ఉత్సాహ భరితంగా సాగిన సంబరాల్లో సామాన్యుల నుంచి వీఐపీల వరకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా ఒక అడుగు ముందుకేసి.. తన ప్రేమ చిగురించినప్పటి రోజుల్లోకి వెళ్లారు. భీమిలితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న రోజా.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల షూటింగ్‌‌లు అక్కడ జరిగినట్లు చెప్పారు. సువిశాల సాగరతీరం, ఎర్రమట్టి దిబ్బలు, పచ్చటి కొండలు.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:06 pm, Mon, 11 November 19
నా లవ్ మొదలయ్యింది ఇక్కడే..!

ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభూతులకు వేదికయ్యింది భీమిలి ఉత్సవాలు. సముద్ర తీరాన అత్యంత ఉత్సాహ భరితంగా సాగిన సంబరాల్లో సామాన్యుల నుంచి వీఐపీల వరకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా ఒక అడుగు ముందుకేసి.. తన ప్రేమ చిగురించినప్పటి రోజుల్లోకి వెళ్లారు.

భీమిలితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న రోజా.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల షూటింగ్‌‌లు అక్కడ జరిగినట్లు చెప్పారు. సువిశాల సాగరతీరం, ఎర్రమట్టి దిబ్బలు, పచ్చటి కొండలు.. కేవలం పర్యాటకులనే కాకుండా.. ప్రేమికులను సైతం… భీమిలి ఆకర్షిస్తుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా.. తన మనసులోని ప్రేమను బయటపెట్టడానికి.. డైరెక్టర్ సెల్వమణి సైతం.. ఎంచుకున్న ప్రాంతం భీమిలియేనట.

భీమిలిలోనే తొలిసారి సెల్వమణి తనకు ఐలవ్యూ చెప్పినట్టు తెలిపారు రోజా. భీమిలి ఉత్సవాలకు హాజరైన రోజా.. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తన సినీ కెరీర్‌కు నాంది పలికింది కూడా భీమిలియేనని పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు.