జగన్ మాటే ఓ శాసనం: రోజా

మహిళల కోసం సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘అమ్మ ఒడి’ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రోజా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లాగే అమ్మ ఒడి కూడా అత్యంత ఆదర్శవంతంగా నిలుస్తుందని రోజా స్పష్టంచేశారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేస్తామని […]

జగన్ మాటే ఓ శాసనం: రోజా

Edited By:

Updated on: Jun 17, 2019 | 9:59 PM

మహిళల కోసం సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘అమ్మ ఒడి’ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రోజా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లాగే అమ్మ ఒడి కూడా అత్యంత ఆదర్శవంతంగా నిలుస్తుందని రోజా స్పష్టంచేశారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేస్తామని సీఎం హామీ ఇవ్వడం సంతోషదాయకమన్నారు. సీఎం జగన్‌ మాటిస్తే జీవోలు, చట్టాలు అవసరం లేదన్న నమ్మకం ప్రతి మహిళకు కలుగుతుందని రోజా వివరించారు.