ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు.. గోరక్షణ కోసం బీజేపీనైనా వ్యతిరేకిస్తానంటూ కామెంట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవుల రక్షణ కోసం అవసరమైతే సొంత పార్టీతో సైతం పోరాటానికి సైతం తానూ సిద్ధమని ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవుల రక్షణ కోసం అవసరమైతే సొంత పార్టీతో సైతం పోరాటానికి సైతం తానూ సిద్ధమని ప్రకటించారు. గతంలోనే గోరక్షణ విషయంలో పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీమానా కూడా సమర్పించానని గుర్తించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గోరక్ష మహాధర్నాలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏకైన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ గో సంరక్షణకు అనకున్న నిబద్ధతను మరోసారి బహిరంగంగా వెల్లడించారు. గోవులు తల్లిలాంటివని.. గోరక్షణ తన ధర్మమని.. తన కర్తవ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని, పార్టీనైనా.. పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తానంటూ ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ ప్రాణిగా ఆవును ప్రకటించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ యుగతులసి పౌండేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో గోమహాధర్నా జరిగింది. ఫౌండేషన్ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు. గోవును రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని, మనిషి సంతోషంగా ఆనందంగా జీవించాలంటే గోవును కాపాడాలన్నారు. గో హత్యలు లేని రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.