గంభీర్ కనిపించడం లేదా..? ఢిల్లీలో పోస్టర్లు..

|

Nov 17, 2019 | 6:58 PM

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ  ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున ఆయనను ఇప్పటివరకు నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ తాజాగా మిస్సింగ్ అంటూ పోస్టర్లు కనిపించడంతో అందరూ షాకయ్యారు. ఆ ఫోస్టర్లలోని సారాంశం: ‘ఈ ఫోటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపించారా..? చివరిసారిగా ఇతడు ఇండోర్‌లో జిలేబీ తింటూ కనిపించాడు. ఆ తర్వాత ఆచూకి లేదు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతుంది’ అని ఆ […]

గంభీర్ కనిపించడం లేదా..? ఢిల్లీలో పోస్టర్లు..
Follow us on

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ  ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున ఆయనను ఇప్పటివరకు నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ తాజాగా మిస్సింగ్ అంటూ పోస్టర్లు కనిపించడంతో అందరూ షాకయ్యారు.

ఆ ఫోస్టర్లలోని సారాంశం:

‘ఈ ఫోటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపించారా..? చివరిసారిగా ఇతడు ఇండోర్‌లో జిలేబీ తింటూ కనిపించాడు. ఆ తర్వాత ఆచూకి లేదు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతుంది’ అని ఆ పోస్టర్లో రాసి ఉంది. వాస్తవంగా గంభీర్.. భారత్‌, బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా ఇండోర్‌ వెళ్లాడు. అక్కడ మరో మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌తో కలిసి జిలేబీ తింటున్న ఫోటో వైరల్ అయింది.  దీంతో ప్రజలు కాలుష్యంతో సతమతమవుతుంటే…స్థానిక ఎంపీ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు గంభీర్‌పై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు.