కరోనా రోగులకు సేవలందిస్తున్న ‘మిస్ ఇంగ్లండ్’

భారత సంతతికి చెందిన డాక్టర్ భాషా ముఖర్జీ లండన్ (బోస్టన్) లోని పిల్ గ్రిమ్ ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. 24 ఏళ్ళ ఈ మాజీ 'మిస్ ఇంగ్లండ్'.. ఇప్పుడు ఈ హాస్పిటల్ లో నిరంతరం రోగులకు చికిత్సలు చేస్తున్నారు.

కరోనా రోగులకు సేవలందిస్తున్న 'మిస్ ఇంగ్లండ్'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 20, 2020 | 1:21 PM

భారత సంతతికి చెందిన డాక్టర్ భాషా ముఖర్జీ లండన్ (బోస్టన్) లోని పిల్ గ్రిమ్ ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. 24 ఏళ్ళ ఈ మాజీ ‘మిస్ ఇంగ్లండ్’.. ఇప్పుడు ఈ హాస్పిటల్ లో నిరంతరం రోగులకు చికిత్సలు చేస్తున్నారు. ఇటీవల ఇండియాలో ఉన్నప్పుడు రెండు వారాల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారట. గత జులై 31 న లండన్ లో జరిగిన ‘మిస్ ఇంగ్లండ్’ పోటీల్లో టైటిల్ గెలుచుకున్న ఈ అందాల భామ.. తనకు వైద్య వృత్తి అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది. డాక్టర్ గా విధులు నిర్వహించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తున్నట్టు ఆమె తెలిపింది. రోజుకు సుమారు 13 గంటల షిఫ్ట్ లో పని చేస్తున్నానని, కానీ శ్రమ అనిపించడం లేదని భాషా ముఖర్జీ వెల్లడించింది. అయితే ఇక్కడి ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు, వైద్య సిబ్బందికి తగినన్ని ప్రొటెక్టివ్ సూట్లు లేకపోవడం చాలా బాధిస్తోందని ఆమె పేర్కొంది.