అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం

అనంతపురం నగరంలో కలకలం రేగింది. పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు ఇద్దరు  దుండగులు ప్రయత్నించారు.

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం

Updated on: Dec 17, 2020 | 10:07 AM

అనంతపురం నగరంలో కలకలం రేగింది. పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు ఇద్దరు  దుండగులు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆలయంలోకి చొరబడ్డ దుండగులు..లక్ష్మీదేవి ఆలయ గోపురం, విగ్రహాలను గునపాలతో ధ్వంసం చేసేందుకు యత్నించారు. గమనించిన  స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. సమాచారం అందిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. దుండగుల కోసం వేట ప్రారంభించారు.  గుప్తనిధుల కోసం ధ్వంసం చేసే ప్రయత్నం చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆయుర్వేదం డబ్బాల్లో కొత్త రకం చాక్లెట్లు, అవి తిన్నారో ఇక అంతే !

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి