ఒంగోలులో కీచక పర్వం..మైనర్ బాలికపై
ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక ఒంగోలు ఔట్ పోస్ట్ పోలీసుల దగ్గరకి చేరుకుని విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు నల్లచెరువుకు చెందిన బాలిక విజయవాడ హాస్టల్‌లో చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికోసం ఆమె ఒంగోలు వచ్చింది. రాత్రి 7.00 […]
ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక ఒంగోలు ఔట్ పోస్ట్ పోలీసుల దగ్గరకి చేరుకుని విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు నల్లచెరువుకు చెందిన బాలిక విజయవాడ హాస్టల్‌లో చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికోసం ఆమె ఒంగోలు వచ్చింది. రాత్రి 7.00 గంటలకు బస్టాండ్‌కు చేరుకున్న ఆమె దగ్గర ఫోన్ లేకపోవడంతో బాజి అనే వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది. అయితే ఎంత సేపటికీ ఫోన్ కలవకపోవడంతో రాత్రి 10.00 గంటల వరకూ ఒంగోలు బస్టాండ్‌లోనే ఉండిపోయింది. దీంతో ఆ బాలికపై బాజి కన్నేశాడు. ప్రియుడి దగ్గరకు చేరుస్తానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు శ్రీకాంత్‌తో కలిసి బాలికను నలుగురు విద్యార్ధులు ఉన్న గదికి తీసుకెళ్లి నిర్భంధించి వారం రోజుల పాటు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.
బాలిక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై అవసరం అయితే షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి ఎస్సీతో మాట్లాడారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కమిషన్ సభ్యురాలు రమాదేవి తెలిపారు.