విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ క్లాస్‌లు

సెప్టెంబర్‌ 1 నుంచి తెలంగాణలో కూడా డిజిటల్‌ క్లాస్‌లు మొదలు కాబోతున్నాయి. దూరదర్శన్‌, టీశాట్‌ తర్వాత క్లాస్‌లు నిర్వహించబోతున్నారు. స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సర్వే చేసిన తర్వాతే డిజిటల్‌ పాఠాలపై నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ క్లాస్‌లు

Updated on: Aug 29, 2020 | 6:16 PM

Minister Sabitha Indra Reddy :  సెప్టెంబర్‌ 1 నుంచి తెలంగాణలో కూడా డిజిటల్‌ క్లాస్‌లు మొదలు కాబోతున్నాయి. దూరదర్శన్‌, టీశాట్‌ తర్వాత క్లాస్‌లు నిర్వహించబోతున్నారు. స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సర్వే చేసిన తర్వాతే డిజిటల్‌ పాఠాలపై నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. టీవీలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా,మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ క్లాస్‌ల షెడ్యూల్ తయారుచేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. రోజుకు మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్‌ క్లాస్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పిల్లల కళ్లకు ఇబ్బంది లేకుండా అరగంట నుంచి 45 నిమిషాలు మాత్రమే క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు చదువు విషయంలో నష్టపోరాదని టీవీ మాధ్యమాల ద్వారా డిజిటల్‌ తరగతులు అందించాలని చిరు ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలకు కొంత సమయం కేటాయించి వారిని ప్రోత్సహించాలి.

అలాంటి వారికి వర్క్‌ షీట్లు అందజేస్తున్నాం. ఉపాధ్యాయులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని చెప్పాం. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులున్నా, తర్వాత సమసిపోతాయని ధీమా  వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి పాఠాలు అందిస్తాం. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో వాటిని ప్రసారం చేస్తాం. పిల్లల సందేహాలను తీర్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవాలని ఆదేశించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.