తెలంగాణ ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ సినిమా ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ఓ టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేసి.. ‘భీష్మ’ చిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ట్వీట్‌పై స్పందించిన హీరో నితిన్ వెంటనే ఫిల్మ్ ఛాంబర్‌లోని యాంటీ పైరసీ సెక్షన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. మరోవైపు.. భీష్మ సినిమా పైరసీని.. తెలంగాణ ఆర్టీసీలో ప్రదర్శించారంటూ.. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా చూడాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి సూచించారు.
Thanks for responding sir ! ??? https://t.co/j7uSdEETRe
— Venky Kudumula (@VenkyKudumula) February 27, 2020
You are always available to solve our problems.. Thank you so much sir ??? https://t.co/c2iRjlIi24
— Venky Kudumula (@VenkyKudumula) February 27, 2020