AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి-మంత్రి కేటీఆర్

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.  భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు సంద‌ర్భంగా అసెంబ్లీలో చ‌ర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి-మంత్రి కేటీఆర్
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2020 | 12:41 PM

Share

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.  భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు సంద‌ర్భంగా అసెంబ్లీలో చ‌ర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వం పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాలని అన్నారు. యుద్ధంలో గెలిచిన‌వాడే చ‌రిత్రను రాస్తారు అని ఒక సామెత ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

రాష్ట్ర ఏర్పాటు జ‌రిగిన 6 సంవ‌త్స‌రాలు పూర్త‌యిందని… పీవీ ఒక్క‌రే కాదు.. తెలంగాణ‌కు సంబంధించిన ఎంతో మందివైతాళికులు మ‌రుగున‌పడ్డారని.. వారిని గుర్తించి గౌర‌వించిన ఘ‌న‌త ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు ద‌క్కుతుందన్నారు. ఈశ్వ‌రీభాయి, భాగ్య‌రెడ్డి వ‌ర్మ‌, సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి, దొడ్డి కొముర‌య్య‌, పైడి జ‌య‌రాజ్, చాక‌లి ఐల‌మ్మ లాంటి ఎంద‌రినో తెలంగాణ సాంస్కృతిక శాఖ‌ గౌర‌వించుకుందని గుర్తు చేశారు.

ఎందరో మ‌హానుభావుల జ‌యంతి, వ‌ర్ధంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంది. వీరి స్ఫూర్తిని భవిష్య‌త్ త‌రాల్లో నింపాలన్నారు. పీవీ న‌ర‌సింహ‌రావు అద్భుత‌మైన వ్య‌క్తి… ఏ రంగంలో త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన‌.. ఆ రంగంలో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు మేలుచేశారని అన్నారు. భూసంస్క‌ర‌ణ‌లు మొద‌లు పెట్టి పేద‌ల‌కు త‌న భూమిని పంచిన మ‌హానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తు చేశారు.