Minister apology: నిండు సభలో మంత్రి క్షమాపణ.. ఎందుకంటే?
నిండు సభలో ఓ రాష్ట్ర మంత్రి క్షమాపణ కోరారు. అది కూడా తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఉదంతం. అది కూడా తాను చేసిన తప్పుకు కాకుండా.. వేరే వాళ్ళు చేసిన తప్పుకు మంత్రి క్షమాపణ కోరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Minister has seeks apology in legislative council: నిండు సభలో ఓ రాష్ట్ర మంత్రి క్షమాపణ కోరారు. అది కూడా తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఉదంతం. అది కూడా తాను చేసిన తప్పుకు కాకుండా.. వేరే వాళ్ళు చేసిన తప్పుకు మంత్రి క్షమాపణ కోరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గురువారం తెలంగాణ శాసనమండలిలో ఆర్టీసీ అంశంపై చర్చ జరిగింది. ఆర్టీసీ సమ్మె కాలం, దానికి చెల్లించిన వేతనం.. వంటి అంశాలపై మొదలైన చర్చలో పలువురు సభ్యులు పెద్ద సంఖ్యలో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై మంత్రి సభలో అంకెలతో సహా వివరించారు. పార్సిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి ఆర్టీసీకి 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.
మార్చి నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీకి రోజుకు కోటిన్నర లాభం వస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో నెలకు 11 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని వివరించారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నామని తెలియజేశారు మంత్రి.
అయితే, ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధుల ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదన్న అంశాన్ని పలువురు ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావించారు. ఒకరి తర్వాత మరొకరు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై మాట్లాడడంతో.. మంత్రి ఎంబర్రాసింగ్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని తాను చక్కదిద్దుతానని చెబుతూ.. ప్రస్తుతానికి ఆ సబ్జెక్టును వదిలేయాలంటూ ఎమ్మెల్సీలకు క్షమాపణలు తెలిపారు మంత్రి అజయ్ కుమార్. దాంతో ఎమ్మెల్సీలు తాము మంత్రి క్షమాపణను ఆశించలేదని, అధికారుల్లో మార్పు రావాలన్నదే తమ ఉద్దేశమని చెప్పుకోవడం కనిపించింది.