సోనూసూద్ సాయానికి కృతజ్ఞతగా.. షాప్‌కు పేరు పెట్టిన వలస కూలీ..

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు.

సోనూసూద్ సాయానికి కృతజ్ఞతగా.. షాప్‌కు పేరు పెట్టిన వలస కూలీ..

Updated on: Jul 20, 2020 | 1:14 AM

Migrant Rescued by Sonu Sood: లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. ఇలా లాక్‌డౌన్‌ వేళ సోనూసూద్ సాయం పొందిన వేలాది మంది వలస కూలీలలో ఒకరు ప్రశాంత్.

కేరళలో చిక్కుకుపోయిన ఇతడ్ని విమానం ద్వారా ఒడిశాలోని తన సొంతూరుకు చేర్చారు. ఇక దానికి కృతజ్ఞతగా ప్రశాంత్ తన కొత్త వెల్డింగ్ షాప్‌కు సోనూసూద్ అనుమతి తీసుకుని ఆయన పేరును పెట్టుకున్నాడు. ”నేను ఎన్నో బ్రాండ్లకు ప్రచారం చేశా.. కానీ ఇది నాకు ఎంతో ప్రత్యేకమైంది. నువ్వు ధనవంతుడివి కావాలని కోరుకుంటున్నా బ్రదర్” అని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..