యువన్ కంపోజింగ్…‘చక్ర’ నుంచి మరో పాట… ‘హ‌ర్లా ఫర్లా’ అంటూ పాటపాడుతున్న యాక్షన్ హీరో విశాల్…

యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది.

యువన్ కంపోజింగ్...‘చక్ర’ నుంచి మరో పాట... ‘హ‌ర్లా ఫర్లా’ అంటూ పాటపాడుతున్న యాక్షన్ హీరో విశాల్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 19, 2020 | 6:13 PM

యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‌ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఈ మూవీ యాక్షన్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం కావ‌డం విశేషం. తాజాగా ఈ చిత్రం నుండి యువ‌న్ సంగీత సారథ్యం వ‌హించిన హ‌ర్లా ఫర్లా సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

‘‘నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ.. రైసైందే ల‌బ్‌డ‌బ్ హార్టుల్లోని గ్రావిటీ..తాకేనా ఆ మేఘాల్ని..నా వ‌ల‌న నీ న‌వ్వుల్నే..కొట్టి కొట్టి క‌న్ను చంప‌మాక‌లా..కిక్కు రేపుతున్న మ‌త్తు మాట‌లా..కొత్త కొత్తగున్న బుట్టబొమ్మలా హ‌ర్లా..ఫ‌ర్లా’’అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాట‌కి డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్లు సాహిత్యం అందించ‌గా రంజిత్‌, సంజ‌న క‌ల్‌మంజి ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌ నేప‌థ్యంలో సరికొత్త క‌థాక‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల‌కానుంది.