పేదింటి అభిమాని కుమార్తె పెళ్లి…’అన్నయ్య’ ఆర్థిక సహాయం, చిరు స్థాయి ఇది అంటోన్న ఫ్యాన్స్

|

Dec 10, 2020 | 7:12 PM

మెగాస్టార్ చిరంజీవి..తెలుగు సినీ జగత్తులో చెరిగిపోని, ఎదరులేని పేరు. నటుడిగా ఆయన స్థాయి, స్థానం గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పేదింటి అభిమాని కుమార్తె పెళ్లి...అన్నయ్య ఆర్థిక సహాయం, చిరు స్థాయి ఇది అంటోన్న ఫ్యాన్స్
Follow us on

మెగాస్టార్ చిరంజీవి..తెలుగు సినీ జగత్తులో చెరిగిపోని, ఎదరులేని పేరు. నటుడిగా ఆయన స్థాయి, స్థానం గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సమాజ సేవలో కూడా మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు చిరంజీవి.

మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానిస్తూ.. రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుండి పనిచేశారు. శేఖర్‌కు ఇద్దరు కూతుర్లు వర్ష, నిఖిత ఉన్నారు. పెద్దమ్మాయి వర్ష వివాహాన్ని ఈ నెల డిసెంబర్ 19 న నిశ్చయించారు. తన అభిమాని కుటుంబం పేదరికం గురించి తెలుసుకున్న చిరంజీవి ఆ ఇంటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల కోసం 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందుకు సంబంధించిన చెక్‌ను శేఖర్ కుటుంబానికి అందించారు.

నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ “రక్త సంబంధీకులు కూడా చేయని సాయం చిరంజీవి గారు చేశారు. ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేనిది” అని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

Also Read :

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..హైదరాబాద్‌లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం