మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఆరుగురు హీరోలు, ఒక హీరోయిన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కాగా వీరిలో హీరోలే కాకుండా నిర్మాతలు కూడా ఉన్నారు. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, కొడుకు రామ్ చరణ్, మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో ప్రొడ్యూసర్ రాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ చిరు, చెర్రీ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్న సుష్మిత ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి మంగళవారం ఆమె వెబ్‌సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తన కుటుంబంలోని హీరోలతో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉందట సుష్మిత. మరి చూడబోతుంటే నిర్మాణ రంగంలో మెగా ఫ్యామిలీలోనే గట్టి పోటీ కనబడేలా ఉంది. కాగా సుష్మిత నిర్మించే వెబ్ సిరీస్‌లు తన మేనమామ అల్లు అరవింద్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: