నట్టింటికి నడిచొచ్చిన లక్ష్మి.. లాటరీలో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి

అదృష్టలక్ష్మి ఎవరిని ఎప్పడు ఎలా కరుణిస్తుందో ఊహించడం కష్టమే. దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 4 మిలియన్ల లాటరీని దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కాల అనే వ్యక్తి 45 రోజుల పాటు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ ఉద్యోగం దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. గతంలో రెండేళ్లపాటు దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన  విలాస్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:26 pm, Sun, 4 August 19
నట్టింటికి నడిచొచ్చిన లక్ష్మి.. లాటరీలో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి

అదృష్టలక్ష్మి ఎవరిని ఎప్పడు ఎలా కరుణిస్తుందో ఊహించడం కష్టమే. దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 4 మిలియన్ల లాటరీని దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కాల అనే వ్యక్తి 45 రోజుల పాటు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ ఉద్యోగం దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు.

గతంలో రెండేళ్లపాటు దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన  విలాస్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉండేది.  దుబాయ్‌లో లాటరీలు కొంటూ వచ్చాడు .  కానీ ఏనాడు జాక్‌పాట్ కొట్టలేకపోయాడు. అక్కడినుంచి తిరిగి వచ్చి మళ్లీ తన డ్రైవర్ వృత్తిలోకి దిగిపోయాడు. అయినా లాటరీలమీద అతనికి ఉన్న మోజు తగ్గలేదు.   ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న విలాస్ తన భార్య వద్ద రూ.20 వేలు తీసుకుని దుబాయ్‌లో ఉన్న తన మిత్రుడు రవిని మూడు లాటరీ టికెట్లు కొనాల్సిందిగా చెప్పాడు. దీంతో దుబాయ్‌లో రవి కొనుగోలు చేసిన మూడు టికెట్లలో ఒకటి విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతడు భారీ లాటరీ గెలుపొందినట్టు అక్కడినుంచి ఫోన్ వచ్చింది. ఈ లాటరీ విలువ ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 28.4 కోట్లన్నమాట.

ప్రస్తుతం ఈ వార్తతో విలాస్ కుటుంబం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ అదృష్టానికి కారణం తన భార్య పద్మ అంటూ మురిసిపోతున్నాడు. లాటరీతో జాక్‌పాట్ కొట్టిన విలాస్ గురించి  గల్ఫ్ న్యూస్ కూడా ఓ వార్తను ప్రచురించింది.