మేడార౦ మినీ జాతర‌

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:14 PM

మినీ జాతర సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈ క్రమంలో ముందుగా భక్తులు కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని జంపన్నవాగు సమీపంలో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ వద్ద స్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి శివసత్తులు పూనకాలతో గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. నిలువెత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, గొర్రెలు, మేకలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. […]

మేడార౦ మినీ జాతర‌
Follow us on

మినీ జాతర సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈ క్రమంలో ముందుగా భక్తులు కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని జంపన్నవాగు సమీపంలో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ వద్ద స్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి శివసత్తులు పూనకాలతో గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. నిలువెత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, గొర్రెలు, మేకలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

తాగునీటి కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ వారు వాటర్‌ట్యాంకుల ద్వారా నీటిని అందించారు. మరుగుదొడ్లు అందుబాటులో ఉండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాలేదు. మేడారంలోని కల్యాణ మండపంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యసిబ్బంది అత్యవసర పరిస్థితిలో భక్తులకు వైద్యసేవలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది.