Master Movie: విజయ్‌ ‘మాస్టర్‌’ సన్నివేశాలు లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది.. ఏకంగా థియేటర్‌..

|

Jan 13, 2021 | 6:14 AM

Master Movie Leake: తమిళ స్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 'మాస్టర్‌' అనే సినిమా తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీతో పాటు..

Master Movie: విజయ్‌ మాస్టర్‌ సన్నివేశాలు లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది.. ఏకంగా థియేటర్‌..
Thalapathy Master Movie
Follow us on

Master Movie Leake: తమిళ స్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘మాస్టర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీతో పాటు ఇటు తెలుగులోనూ మంచి బజ్‌ ఉందని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను విడుదలచేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేసింది. ఈ క్రమంలోనే విడుదలకు ఒక్కరోజు ముందు ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సినిమా విడుదలకు ముందే సన్నివేశాలు లీక్‌ కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా ఈ లీక్‌ వెనక ఉన్న వ్యక్తిని గుర్తించారు. చెన్నైలోని ఓ థియేటర్‌ ఉద్యోగి మాస్టర్‌ సన్నివేశాలను లీక్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. థియేటర్‌కు వచ్చిన మాస్టర్‌ సినిమా ప్రింట్‌ నుంచే సదరు ఉద్యోగి సినిమాలోని కొన్ని సీన్లను లీక్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఉద్యోగిపై చిత్ర యూనిట్‌ ఫిర్యాదు చేసింది. సన్నివేశాలు లీక్‌ చేసిన ఉద్యోగితో పాటు థియేటర్‌పై కూడా లీగల్‌ చర్యలు తీసుకోవడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. మరి లీక్‌ వ్యవహారాన్ని ఎదురించి విడుదలకు సిద్ధమవుతోన్న మాస్టర్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి .

Also Read: Ram In Red: ‘రెడ్‌’ సినిమాను ఓటీటీలో విడుదల చేయమని ఎన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ ఆయన అలా చేయలేదు..