Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై ఏకంగా రూ. 62,000 వరకూ తగ్గింపు.. కారు కొనాలనుకొంటే ఆలస్యం చేయొద్దు..

| Edited By: Ravi Kiran

Sep 15, 2023 | 6:45 AM

మారుతి సుజుకీ ఎరినా డీలర్లు దాదాపు అన్ని మోడళ్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. బ్రెజ్జా, ఎర్టిగా కార్లపై మాత్రం ఈ ఆఫర్ లేదు. ఈ రెండు కార్లను మినహాయించి మిగిలిన అన్ని కార్లపై ప్రత్యేక తగ్గింపు ఉంది. రానున్న వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎరీనా డీలర్స్ వెల్లడించారు. వివిధ డిస్కౌంట్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్, క్యాష్ బెనిఫిట్స్ అన్ని కలిపి దాదాపు రూ. 62,000 వరకూ ధర తగ్గుతుంది.

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై ఏకంగా రూ. 62,000 వరకూ తగ్గింపు.. కారు కొనాలనుకొంటే ఆలస్యం చేయొద్దు..
Maruti Suzuki
Follow us on

మీరు కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మన దేశంలో టాప్ బ్రాండ్ అయిన మారుతి సుజుకీ కార్లపై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకీ ఎరినా డీలర్లు దాదాపు అన్ని మోడళ్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. బ్రెజ్జా, ఎర్టిగా కార్లపై మాత్రం ఈ ఆఫర్ లేదు. ఈ రెండు కార్లను మినహాయించి మిగిలిన అన్ని కార్లపై ప్రత్యేక తగ్గింపు ఉంది. రానున్న వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎరీనా డీలర్స్ వెల్లడించారు. వివిధ డిస్కౌంట్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్, క్యాష్ బెనిఫిట్స్ అన్ని కలిపి దాదాపు రూ. 62,000 వరకూ ధర తగ్గుతుంది. ఈ ఆఫర్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలోని అన్ని మోడళ్లపైనా లభిస్తోంది. ఆ కార్లు ఏంటి? ఆఫర్ ఏంటి? తెలుసుకుందాం రండి..

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో.. మారుతీ సుజుకి గత నెలలో ఎస్ ప్రెస్సోపై అందిస్తున్న గత నెల వరకూ అందిస్తున్న రూ.57,000 తగ్గింపును సెప్టెంబర్‌ నుంచి రూ.62,000కి పెంచింది. పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లు రెండూ కూడా రూ. 62,000 తగ్గింపుతో లభిస్తాయి, అయితే ఈ ఆఫర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌పై మాత్రమే చెల్లుతుంది. మరోవైపు, ఏఎంటీ ట్రిమ్ పై రూ. 37,000 తగ్గిపును పొందొచ్చు. దీనిలోని 1- లీటర్ ఇంజిన్ 66బీహెచ్ పీ, 89ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో 24.76 కేఎంపీఎల్, ఏఎంటీతో 25.3కేఎంపీఎల్, సీఎన్జీ వెర్షన్ 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకి సెలెరియో.. ఈ కారుపై రూ. 62,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ పెట్రోల్ మాన్యువల్, సీఎన్జీ వెర్షన్‌లపై లభిస్తోంది. ఏఎంటీ ట్రిమ్ పై రూ. 47,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ పై మైలేజీ 25.24 కేఎంపీఎల్, ఏఎంటీ వెర్షన్ 26.68 కేఎంపీఎల్, సీఎన్జీ వెర్షన్ 34.43 కేఎంపీఎల్ మైలేజీ వస్తుంది. ఈ సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.15 లక్షల వరకు ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి ఆల్టో.. మారుతి సుజుకీ నుంచి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇది. దీనిపై రూ. 58,000 వరకు తగ్గింపు లభిస్తోంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రిమ్ ఈ ఆఫర్‌ను పొందుతుంది. ఏఎంటీవెర్షన్ రూ. 33,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తోంది. ఆల్టో ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా.. హైఎండ్ రూ. 5.96 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్.. దేశంలో ఆగస్టులో అత్యధికంగా అమ్ముడైన కారు స్విఫ్ట్, ఎల్‌ఎక్స్‌ఐ మినహా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ట్రిమ్‌లపై రూ.57,000 వరకు తగ్గింపును వినియోగదారులు పొందొచ్చు. ఎంట్రీ-లెవల్ ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్‌లు రూ. 52,000 వరకు తగ్గింపును పొందుతాయి. సీఎన్జీ వెర్షన్ పై రూ. 22,000 వరకు తగ్గింపు లభిస్తుంది. స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.03 లక్షల వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..