‘మార్చి’ పేరు చెబితేనే ఇట‌లీ వెన్నులో వ‌ణుకు..ప్ర‌పంచ దేశాల‌కూ ఓ పీడ క‌ల‌

క‌రోనా వైర‌స్ ఇటలీని శ‌వాల దిబ్బ‌గా మార్చేసింది. రోజుకు వేల సంఖ్య‌లో ప్రాణాలు పోతుంటే ఏం చేయ‌లేకపోతుంది ఆ దేశం. పుట్టిన చైనా కంటే ఇట‌లీకే ఎక్కువ డ్యామేజ్ చేసింది కరోనా వైర‌స్. మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుట్టేలా.. క‌రోనా మ‌హమ్మారి అక్క‌డ మ‌నుషుల ప్రాణాల్ని చిదిమేస్తుంది. ఇప్ప‌టికి అక్క‌డ‌ 12,428 మంది కొవిడ్‌-19తో చనిపోయారు. ప్రాణాలు విడిచినవారి స్మారకార్థం మంగళవారం ఇటలీ.. జాతీయ పతాకాలను అవనతం చేసి…మౌనం పాటించింది. సెకండ్ వ‌రల్డ్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:34 pm, Wed, 1 April 20
'మార్చి' పేరు చెబితేనే ఇట‌లీ వెన్నులో వ‌ణుకు..ప్ర‌పంచ దేశాల‌కూ ఓ పీడ క‌ల‌

క‌రోనా వైర‌స్ ఇటలీని శ‌వాల దిబ్బ‌గా మార్చేసింది. రోజుకు వేల సంఖ్య‌లో ప్రాణాలు పోతుంటే ఏం చేయ‌లేకపోతుంది ఆ దేశం. పుట్టిన చైనా కంటే ఇట‌లీకే ఎక్కువ డ్యామేజ్ చేసింది కరోనా వైర‌స్. మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుట్టేలా.. క‌రోనా మ‌హమ్మారి అక్క‌డ మ‌నుషుల ప్రాణాల్ని చిదిమేస్తుంది. ఇప్ప‌టికి అక్క‌డ‌ 12,428 మంది కొవిడ్‌-19తో చనిపోయారు. ప్రాణాలు విడిచినవారి స్మారకార్థం మంగళవారం ఇటలీ.. జాతీయ పతాకాలను అవనతం చేసి…మౌనం పాటించింది. సెకండ్ వ‌రల్డ్ వార్ తర్వాత ఆ దేశంలో ఇంత‌మంది ప్రాణాలు పోగొట్టుకోవ‌డం ఇదే మొద‌టిసారి.

ఫిబ్రవరి చివరి వారంలో ఇట‌లీలోని మిలన్‌లో తొలి కరోనా కేసు న‌మోదైంది. ఆ తర్వాత ఈ వైరస్‌ దేశంలోని ప్ర‌తి మూల‌కు విస్త‌రించింది. గ‌త‌ మూడు వారాలుగా అక్కడ లాక్‌డౌన్ అమ‌లవుతోంది. దాదాపు లక్ష మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. మ‌రోవైపు కోవిడ్ ఆ దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఐరోపా కూటమిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీ ప‌రిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. ఏప్రిల్ మిడిల్ వ‌ర‌కు లాక్ డౌన్ కొనసాగుతుంద‌ని అక్క‌డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఏది ఏమైనా ప్ర‌పంచ దేశాల‌కు మార్చి నెల ఓ మ‌రుపురాని పీడ‌క‌ల‌గా మిగిలిపోతుంది. కానీ ఇట‌లీకి మాత్రం మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుట్టే విధంగా క‌రోనా ఆ దేశాన్ని పీడిస్తుంది.