తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు.. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు..

|

Dec 27, 2020 | 6:26 AM

తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలు పెద్ద సంఖ్యలో ప్రవేశించారని

తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు.. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు..
Follow us on

తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలు పెద్ద సంఖ్యలో ప్రవేశించారని సమాచారం తెలుస్తోంది. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక బలగాలను తరలించి కూంబింగ్ ప్రారంభించింది.

తెలంగాణ కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో కురసం మంగు అలియాస్ భద్రు, పాండు, కొవ్యాసి గంగ, అలియాస్ మహేష్, మంగ్లు, బూర రాజేశ్ అలియాస్ శివ, యాతమ్ నరేంద్ర, అలియాస్ సంపత్‌తో కూడిన బృందం రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్ర నాయకులు రాష్ట్రంలోకి ప్రవేశించారంటే పక్కా ప్లాన్‌తోనే వచ్చారని అర్థమవుతోంది. దీంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి హాని తలపెడతారో అని కంగారుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇన్‌ఫార్మర్ నెపంతో చర్ల మండలంలో ఒకరిని, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఒకరిని చంపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ స్థాయిలో మావోల రిక్రూట్ మెంట్ చేపడుతున్నారనే సమాచారం కూడా వస్తోంది. పార్టీ బలోపేతం కోసమే రాష్ట్రంలో అగ్ర నాయకులు సంచరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించిన విషయం అందరికి తెలిసిందే.