జోరుగా జంపింగ్ జపాంగ్‌లు..టిడిపి, జనసేన కుదేలేనా ?

అధికారంలో లేకుండా అయిదేళ్ళు ఆగలేని నేతల నెంబర్ పెరుగుతుండడం ఏపీలో టిడిపి, జనసేన పార్టీల మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తోంది. రోజుకో నేత జంపింగ్ జపాంగ్‌ల జాబితాలో చేరుతుండడం టిడిపి, జనసేన అధినాయకత్వాలను తలనొప్పిగా మారింది. ఓవైపు క్యాడర్‌ను కాపాడుకోవడంతోపాటు.. మరోవైపు లీడర్లను కూడా కాపుకాయాల్సిన పరిస్థితి తలెత్తడంతో అధినేతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వంపై పోరాడాలో లేక జంపింగ్ జపాంగ్‌లకు కాపలా కాయాలో తెలియక అధినేతలు సతమతం అవుతున్నట్లు సమాచారం. తాజాగా వైసీపీ నేత నారాయణ స్వామి చేసిన […]

జోరుగా జంపింగ్ జపాంగ్‌లు..టిడిపి, జనసేన కుదేలేనా ?
Rajesh Sharma

|

Nov 02, 2019 | 1:20 PM

అధికారంలో లేకుండా అయిదేళ్ళు ఆగలేని నేతల నెంబర్ పెరుగుతుండడం ఏపీలో టిడిపి, జనసేన పార్టీల మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తోంది. రోజుకో నేత జంపింగ్ జపాంగ్‌ల జాబితాలో చేరుతుండడం టిడిపి, జనసేన అధినాయకత్వాలను తలనొప్పిగా మారింది. ఓవైపు క్యాడర్‌ను కాపాడుకోవడంతోపాటు.. మరోవైపు లీడర్లను కూడా కాపుకాయాల్సిన పరిస్థితి తలెత్తడంతో అధినేతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వంపై పోరాడాలో లేక జంపింగ్ జపాంగ్‌లకు కాపలా కాయాలో తెలియక అధినేతలు సతమతం అవుతున్నట్లు సమాచారం.
తాజాగా వైసీపీ నేత నారాయణ స్వామి చేసిన కామెంట్లు టిడిపిని కలవరపెడుతున్నాయి. ఏ ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేను చూసినా.. పరస్పరం అనుమానంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలుండగా… వారిలో వల్లభనేని వంశీ తాను పార్టీకి, పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆల్‌రెడీ ప్రకటించారు. మరి సడన్‌గా నారాయణ స్వామి ప్రకటన వెనుక రాజకీయ వ్యూహం ఏంటనేది ఇపుడు చర్చనీయాంశమైంది.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో మొత్తం 16 మంది వైసీపీకి టచ్‌లో వున్నారంటూ నారాయణస్వామి బాంబు పేల్చారు. జగన్ చిన్న సైగ చేస్తే చాలు వారంతా వైసీపీలోకి చేరతారన్నది స్వామి ప్రకటన సారాంశం.
ఇంకోవైపు విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా వున్నట్లు కథనాలొస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఒకరని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నారాయణస్వామి చెప్పిన 16 మంది జంప్ అయితే టిడిపి పెద్ద చిక్కే. అసలే గెలిచింది 23 మంది వారిలో 16 మంది పోతే మిగిలేది.. ఏడుగురు. దాంతో పాటు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది. ఏపీ శాసనసభ మరీ ఏకపక్షంగా మారిపోతుంది. మిగిలిన ఏడుగురితో ఐదేళ్ళు నెగ్గుకు రావడం కంటే గతంలో జగన్ చేసినట్లు అసెంబ్లీకి దూరంగా వుండడమే మేలు అన్నట్లు పరిస్థితి తయారవుతుంది.
మరోవైపు ఇసుక పోరాటాన్ని ఉధృతం చేసే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో లాంగ్ మార్చ్ ప్రకటించిన జనసేనకు శనివారం పెద్ద ఝలక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు శనివారమే పవన్ కల్యాణ్‌కు లేఖ రాస్తారని బాలరాజు సన్నిహితులు చెబుతున్నారు. ఆదివారం జరగనున్న విశాఖ లాంగ్ మార్చ్‌ ఏర్పాట్లను సమీక్షించిన నాదెండ్ల మనోహర్, నాగబాబుల సమావేశానికి కూడా బాలరాజు హాజరు కాలేదు.  కొంతకాలంగా ఆయన జనసేన కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు.
ఇలా కీలకమైన నేతలంతా జారుకుంటూ.. తలొదారి చూసుకోవడం టిడిపి, జనసేన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అయిదేళ్ళు క్యాడర్‌ని, లీడర్లను కాపాడుకోవడమే ఇప్పుడో సవాల్‌గా మారింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu