మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

|

Aug 11, 2020 | 6:03 PM

రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునే లోపలే కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. మణిపూర్ లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను నేరుగా స్పీకర్‌కే పంపించారు.

మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా
Follow us on

రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునే లోపలే కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. మణిపూర్ లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను నేరుగా స్పీకర్‌కే పంపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసన సభ్యుడు హెన్రీ సింగ్ ప్రకటించారు. తమ నేత ఓ లబోబి సింగ్ నాయకత్వంపై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని సింగ్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ముగియగానే… ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ సమావేశమయ్యారు. అనంతరం వారి రాజీనామా లేఖలను పరిశీలించినట్లు స్పీకర్ తెలిపారు. వారి రాజీనామా లేఖలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని హెన్రీ సింగ్ తెలిపారు.

మరోవైపు , పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీ ఒక్క రోజు సమావేశాన్ని ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసహ్యులు హాజరయ్యారు. బిజెపి నేతృత్వంలోని ఎన్ బిరెన్ సింగ్ ప్రభుత్వం బలపరీక్షలో విశ్వాస ఓటు వేశారు. అనంతరం నేరుగా స్పీకర్ వద్దకు వెళ్లిన తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాంగ్ఖే అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యే అయిన హెన్రీ సింగ్ తోపాటు, రాజీనామా చేసిన శాసనసభ్యులు వాంగోయికి చెందిన ఓనమ్ లుఖోయ్, లిలాంగ్కు చెందిన ఎండి అబ్దుల్ నాసిర్, వాంగ్జింగ్ టెనతాకు చెందిన పానమ్ బ్రోజెన్, సైతుకు చెందిన నాగమాతంగ్ హాకిప్, సింఘాట్ యొక్క గిన్సువాన్ వావ్ ఉన్నారు.