AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలికి ప్రేమతో పుట్టిన రోజు కానుక.. విచిత్ర బహుమతితో జైలు పాలైన జంట! కథ కాదండోయ్..

ప్రియురాలిని ఖుషి చేయడానికి వినూత్నంగా ఆలోచించిన ఒక వ్యక్తి, కన్న కలలు చివరకు అతడిని జైలు పాలు చేశాయి. ప్రియురాలి పుట్టినరోజు కానుకగా ఒక అరుదైన ఒంటెమరిని గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన యువకుడు, దాన్ని కొనడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో సమీపంలోని ఫామ్‌హౌస్ నుండి దొంగిలించాడు. అనంతరం దొంగతనం బయటపడుతుందనే భయంతో ఒక విచిత్రమైన కథ అల్లి పోలీసులకు అడ్డంగా చిక్కాడు..కట్‌చేస్తే ప్రేమికులిద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది..అసలు విషయంలోకి వెళితే..

ప్రియురాలికి ప్రేమతో పుట్టిన రోజు కానుక.. విచిత్ర బహుమతితో జైలు పాలైన జంట! కథ కాదండోయ్..
Dubai Man Steals Baby Camel
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2026 | 1:04 PM

Share

ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి రకరకాల కానుకలు ఇస్తుంటారు. కానీ, దుబాయ్‌లో ఒక వ్యక్తి తన ప్రియురాలి పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని చేసిన ప్రయత్నం ఊహించని మలుపు తిరిగింది. బర్త్‌డే గిఫ్ట్‌గా ఏకంగా ఒక కొత్తగా జన్మించిన అరుదైన ఒంటెమరిని దొంగిలించి, చివరకు కటకటాల పాలయ్యాడు.

దుబాయ్‌కి చెందిన ఒక యువకుడి ప్రియురాలికి ఒంటె అంటే ఎంతో ఇష్టం. ఆమె తన పుట్టినరోజు కానుకగా ఒక అరుదైన ఒంటెను ఇవ్వాలని కోరింది. అయితే సదరు జాతి ఒంటెను కొనుగోలు చేయడానికి ఆ వ్యక్తి వద్ద తగినంత డబ్బు లేదు. ఎలాగైనా ప్రియురాలి కోరిక తీర్చాలనే ఉద్దేశంతో, అతడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన నివాసం సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో కొత్తగా జన్మించిన ఒంటెమరి ఉందనే విషయాన్ని గుర్తించి, రాత్రి వేళ రక్షణ వలయాన్ని దాటి ఆ పసి ఒంటెను దొంగిలించి ప్రియురాలికి బహుమతిగా ఇచ్చాడు.

ఫామ్‌హౌస్ నుండి ఒంటెమరి కనిపించకుండా పోవడంతో యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా ప్రారంభంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొన్ని రోజుల తర్వాత, సదరు దొంగిలించిన వ్యక్తే పోలీసులకు ఫోన్ చేసి, తన ఫామ్‌హౌస్ సమీపంలో ఒక తప్పిపోయిన పసి ఒంటె ప్రత్యక్షమైందని నాటకం ఆడటానికి ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి

మూల స్థానం నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డును దాటుకుని అంత చిన్న ఒంటెమరి అంత దూరం ఒంటరిగా నడిచి వచ్చే అవకాశం లేదని పోలీసులు పసిగట్టారు. తీవ్రమైన శైలిలో విచారించడంతో, ఆ యువకుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. పట్టుబడతామనే భయంతోనే తప్పిపోయిందంటూ నాటకమాడినట్లు అంగీకరించాడు.

విషయం తెలిసిన పోలీసులు, ఒంటెమరిని భద్రంగా స్వాధీనం చేసుకుని నిజమైన యజమానికి అప్పగించారు. దొంగతనానికి పాల్పడిన యువకుడితో పాటు, ఆ ఒంటెమరిని దొంగిలించినదిగా తెలిసి కూడా దగ్గర ఉంచుకున్న ప్రియురాలిపై కూడా కేసులు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఎంతటి ప్రేమైనా చట్టవ్యతిరేక మార్గంలో చూపిస్తే జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ ఘటన ఒక విచిత్ర ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలికి పుట్టిన రోజు కానుక..కట్‌చేస్తే కటకటాల్లోకి ప్రేమజంట!
ప్రియురాలికి పుట్టిన రోజు కానుక..కట్‌చేస్తే కటకటాల్లోకి ప్రేమజంట!
కప్పల గురించి ఇది తెలుసా? నోటితో కాకుండా నీటిని ఎలా తాగుతాయంటే?
కప్పల గురించి ఇది తెలుసా? నోటితో కాకుండా నీటిని ఎలా తాగుతాయంటే?
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..
సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్
టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!
రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు!
రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు!
మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..
మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..