బెంగళూరు: కర్నాటకలోని ధార్వాడ్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇవాళ శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ యువకుడిని రెస్య్కూ టీం కాపాడింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయినట్లు ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ దీపా చోలన్ వెల్లడించారు. నిన్న ఇద్దరిని కాపాడాం. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద ఉన్నారు. వారికి ఆక్సిజన్ అందిస్తున్నాం, ఓఆర్ఎస్ పంపించాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెస్క్యూ టీం 60 మందిని సురక్షితంగా కాపాడింది. అధికారులు ఘటనాస్థలంలో 10 అంబులెన్సులు, 5 అగ్నిమాపక దళ వాహనాలు అందుబాటులో ఉంచారు.
#WATCH Man rescued from Dharwad building collapse site today after the under-construction building collapsed on March 19. #Karnataka pic.twitter.com/ODimTCxdoG
— ANI (@ANI) March 22, 2019