Viral Video: వాటే ఐడియా సర్జీ.. రైలుబోగీలా బైక్ కి ట్రాలీ తగిలించి ఏకకాలంలో పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్
Viral Video:ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏవింతలు విశేషాలు జరిగినా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొన్ని నవ్వులు..
Viral Video:ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏవింతలు విశేషాలు జరిగినా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొన్ని నవ్వులు పూయించేవి అయితే.. మరికొన్ని ఆలోచింపజేసేవి.. ఇంకొన్ని ఎదుటివారికి సాయం చేస్తూ అండగా నిలబడేవి. ఒకటేమిటి. జంతువులు, వస్తువులు, మనుసులు ఇలా ప్రతిదానికి సంబంధించిన వీడియోలు నెట్టింటిలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక రోజు రోజుకీ పెరుగుతన్న పెట్రోల్ డీజిల్ ధరలపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి మాత్రం పెట్రోల్ ధరలు పెరిగినా నాకు చింత లేదు అంటుంన్నాడు. తన బుర్రకు పదును పెట్టి. కత్తిలాంటి ఐడియా వేశాడు.. బైక్ కు ఎడ్ల బండి లాంటి దానికి రైలు బోగీకి లింక్ చేసినల్టు లింక్ పెట్టి.. సరికొత్త బైక్ బండిని సృష్టించాడు. ఒక్కసారే కుటుంబం మొత్తం తక్కువ ఖర్చుతో ప్రయాణిస్తున్నాడు.
ఓ వ్యక్తి తన బైకుకు ట్రాలీ కి లింక్ వేశాడు.. ఆ ట్రాలీ లో పరువు వేసి.. మొత్తం కుటుంబ సభ్యులను అందులో కూర్చోబెట్టాడు. బైక్ మీద కూర్చున్న అతని వెనుక మరో వ్యక్తి కూర్చుని ఉంది. ఇక ట్రాలీలో నలుగురు పిల్లలు, మరో నలుగురు మహిళలు మొత్తం ఎనిమిది మంది కూర్చున్నారు. బైక్ ను డ్రైవ్ చేస్తుంటే. ఆ ట్రాలీ ట్రాక్టర్ లా వెళ్ళిపోయింది. అంటే.. బైక్, ట్రాలీ తో కలిసి మొత్తం 10 మంది ఏకకాలంలో ప్రయాణిస్తున్నారు.
అయితే ఆ బైక్ మీద వెళ్తున్న అతను పెట్రోల్ కోసం ఓ బంక్ దగ్గర ఆగినప్పుడు ఎవరో ఈ వీడియో తీసినట్లున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది.. ఐతే కొంతమంది వాటే ఐడియా సర్జీ అంటుంటే.. మరొకొందరు.. ఇలా ప్రయాణం చేయడం ప్రమాదం అని.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలు తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దీపని ట్రీట్మెంట్ కోసం ఒప్పించే ప్రయత్నంలో డాక్టర్ బాబు.. కార్తీక్ ని కలవడానికి బయలుదేరిన మోనిత
రోహిత్ శర్మపై స్విగ్గి వివాదాస్పద పోస్ట్.. యాప్‌ని డిలీట్ చేయమంటున్న ఫ్యాన్స్