షర్మిలపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో షర్మిలపై అసభ్యకరమైన కామెంట్లు చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా హరీశ్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. షర్మిలపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో పాటు ట్రోలింగ్ చేసినందుకు గానూ అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్ 15ఏళ్లుగా చౌటుప్పల్‌లో […]

షర్మిలపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
YS Sharmila

Edited By:

Updated on: Mar 26, 2019 | 8:05 AM

సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో షర్మిలపై అసభ్యకరమైన కామెంట్లు చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా హరీశ్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. షర్మిలపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో పాటు ట్రోలింగ్ చేసినందుకు గానూ అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్ 15ఏళ్లుగా చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చౌటుప్పల్ సమీపంలోని తంగెడిపల్లిలోని ఓ ఫార్మాసూటికల్ సంస్థలో పనిచేస్తున్నాడు.