AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం మీదకు తెచ్చిన అతి జాగ్రత్త

జాగ్రత్త మంచిదే కానీ, అతి జాగ్రత్తే ఒక్కోసారి కొంప ముంచేస్తుంది.. కరోనా మహమ్మారి మనకు అంటకుండా ఉండేందుకు శానిటైజేషన్‌ తప్పనిసరి అని చెప్పిన మాటను పాపం యాకుబ్‌ వేరే రకంగా అర్థం చేసుకున్నాడు..

ప్రాణం మీదకు తెచ్చిన అతి జాగ్రత్త
Balu
|

Updated on: Sep 08, 2020 | 1:15 PM

Share

జాగ్రత్త మంచిదే కానీ, అతి జాగ్రత్తే ఒక్కోసారి కొంప ముంచేస్తుంది.. కరోనా మహమ్మారి మనకు అంటకుండా ఉండేందుకు శానిటైజేషన్‌ తప్పనిసరి అని చెప్పిన మాటను పాపం యాకుబ్‌ వేరే రకంగా అర్థం చేసుకున్నాడు.. తనతో పాటు తన కుటుంబసభ్యులందరూ శానిటైజ్‌ చేసుకుంటే సరిపోదనుకున్నాడు.. తినే చికెన్‌కు కూడా శానిటైజ్‌ చేశాడు.. ఇదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.

యాకుబ్‌ ఉండేది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో.. కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు.. ఆగస్టు మొదటివారంలో చికెన్‌ కొని తెచ్చాడు.. చికెన్‌ నుంచి కరోనా అంటుకుంటుందేమోనన్న భయం వెంటాడింది.. చికెన్‌ వండిన తర్వాత చక్కగా శానిజైటర్‌ను అందులో కలిపేశాడు.. చికెన్‌ వాసన చూసిన తర్వాత భార్యా పిల్లలకు ఏదో అనుమానం వచ్చింది.. తినమంటే తినమని చెప్పేశారు.. యాకుబ్‌ ఒక్కడే చికెన్‌ అంతా తినేశాడు.. తిన్న కాసేపటికే వాంతులయ్యాయి.. వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాడు.. వైద్యులు పరీక్షలన్నీ చేసి పేగులు దెబ్బతిన్నాయన్న చేదు వార్త చెప్పారు.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే అంతా సర్దుకుంటుందని అన్నారు.. అయితే ఆసుపత్రిలో ఉంటే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం కొద్దీ వైద్యులకు, సిబ్బందికి చెప్పకుండా ఇంటికొచ్చేశాడు.. ఇప్పుడు రోగం కాస్త ముదిరింది.. కాళ్లూచేతులు పని చేయడం మానేశాయి.. పరిస్థితి విషమించడంతో స్థానిక జడ్పీటీసీ తనకు చేతనైనంత సాయం చేశాడు.. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.. వైద్యసాయం అందిస్తామని ఈటల హామీ ఇవ్వడంతో యాకుబ్‌తో పాటు కుటుంబసభ్యులు కాస్త ఊరట చెందారు..

Follow Us
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం
ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు?
ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు?
బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు
బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు
లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?
లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?