నిజామాబాద్‌లో కత్తుల కలకలం.. వ్యక్తిని అత్యంత దారుణంగా..!

నిజామాబాద్‌లో కత్తులతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో అబ్దుల్ ఫిరోజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అబ్దుల్ ఫిరోజ్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి.. దారుణంగా హతమార్చారు. హతమార్చిన తర్వాత.. ఫిరోజ్‌ మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు లాగి రోడ్డుపై పడేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు ఉడాయించారు. ఫిరోజ్ మృతదేహాన్ని చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం […]

నిజామాబాద్‌లో కత్తుల కలకలం.. వ్యక్తిని అత్యంత దారుణంగా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 16, 2019 | 3:38 PM

నిజామాబాద్‌లో కత్తులతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో అబ్దుల్ ఫిరోజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అబ్దుల్ ఫిరోజ్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి.. దారుణంగా హతమార్చారు. హతమార్చిన తర్వాత.. ఫిరోజ్‌ మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు లాగి రోడ్డుపై పడేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు ఉడాయించారు. ఫిరోజ్ మృతదేహాన్ని చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. విచరాణ చేపట్టారు. పాత కక్షల కారణంగానే.. ఫిరోజ్‌ని అంత దారుణంగా హత్య చేసి ఉండవచ్చునని వారు అనుమానిస్తున్నారు.