గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి రణరంగం.. పికప్ వ్యానుతో ఆస్పత్రిపై దాడి.. మెడికల్ షాపుతో సహా 18 వాహనాలు ధ్వంసం

|

Dec 20, 2020 | 10:49 PM

గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి పికప్ వ్యానుతో బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి సిబ్బందిపై కోపంతో లారీతో నానా హంగామా చేశాడు. ఈ ఘటనలో ఓ మెడికల్ షాపుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి రణరంగం..  పికప్ వ్యానుతో ఆస్పత్రిపై దాడి.. మెడికల్ షాపుతో సహా 18 వాహనాలు ధ్వంసం
Follow us on

గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి పికప్ వ్యానుతో బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి సిబ్బందిపై కోపంతో లారీతో నానా హంగామా చేశాడు. ఈ ఘటనలో ఓ మెడికల్ షాపుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దిగ్భ్రాంతికరమైన సంఘటన గురుగ్రామ్ లోని బసాయి చౌక్ సమీపంలోని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బందితో వివాదం తలెత్తడంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కుటుంబసభ్యుల వైద్యం విషయంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆసుపత్రి సిబ్బందితో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి పిక్‌అప్‌ ట్రక్‌తో ఆసుపత్రిపై దాడికి దిగాడు. శుక్రవారం రాత్రి జరిగిన మొత్తం సంఘటన సిసిటివి కెమెరాలో నమోదు అయ్యింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


గురుగ్రామ్‌లోని బాలాజీ ఆసుపత్రిపైకి ట్రక్కు తీసుకొచ్చి విచక్షణారహితంగా డ్రైవింగ్‌ చేశాడు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రి మెడికల్ స్టోర్ ధ్వంసమైంది. అలాగే, ఆసుపత్రి ప్రాంగణానికి వెలుపల ఉంచిన అంబులెన్స్ వాహనంతో సహా దాదాపు 15 వాహనాలను ఢీకొట్టాడు. మనుషులను ఢీకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వాహన డ్రైవర్‌ను గురుగ్రామ్‌లోని ధన్‌కోట్ గ్రామానికి చెందిన వికాస్ జూన్గా గుర్తించారు.

బసాయి చౌక్ వద్ద ఉన్న శ్రీ బాలాజీ హాస్పిటల్ డైరెక్టర్ బల్వాన్ సింగ్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కొన్ని గాయాల కారణంగా ఆసుపత్రికి వచ్చారు. రెండు గ్రూపుల మధ్య కోట్లాటతో గాయాలయ్యాయి. ఈ విషయంలో గొడవ జరిగి దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.