నీటి గుంటలో జారిపడి వృద్ధ దంపతుల దుర్మరణం
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలంలో కురవపల్లిలో వృద్ధ దంపతులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి దుర్మరణం పాలయ్యారు.
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలంలో కురవపల్లిలో వృద్ధ దంపతులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి దుర్మరణం పాలయ్యారు. ఇట్నేనివారిపల్లె సమీపంలోని నారాయణ (68) వెంకట రమణమ్మ (62) దంపతులు పొలంలో వేరుశనగ పంటకు కాపలాగా ఉంటున్నారు. అయితే, సోమవారం గుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లిన భార్య ప్రమాదవశాత్తు జారిపడి నీటి గుంటలో పడిపోయింది. ఇది గమనించి ఆమెను రక్షించడానికి వెళ్లిన భర్త కూడా అందులో మునిగిపోయాడు. దీంతో దంపతులిద్దరూ గుంట దురదలో కురుక్కుపోయి మృతి చెందారని స్థానికులు చెప్పారు. ఈ ఘటనతో కురవపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నారాయణ, వెంకట రమణమ్మ దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె మండలంలోని సిటిఎంలో స్థిరపడ్డారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా వారి సొంత గ్రామమైన కురవపల్లెకు వచ్చి నివాసముంటున్నారు. దంపతుల మరణంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.