ధోనీ.. మరో అరుదైన రికార్డు

ఐపీఎల్ 2020లో మరో అరుదైన రికార్డు నమోదైంది. నిన్న వార్నర్ సరికొత్త రికార్డును స‌ృష్టించగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.  ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు...

  • Sanjay Kasula
  • Publish Date - 9:07 pm, Mon, 19 October 20
ధోనీ.. మరో అరుదైన రికార్డు

ఐపీఎల్ 2020లో మరో అరుదైన రికార్డు నమోదైంది. నిన్న వార్నర్ సరికొత్త రికార్డును స‌ృష్టించగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.  ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా ధోనీ ఈ మైలురాయి చేరుకున్నాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మహీ  30 మ్యాచ్‌లు ఆడాడు.

 

2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచి ధోనీ చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. చెన్నై ప్రాంఛైజీపై రెండేళ్లు నిషేధం విధించడంతో అతడు రైజింగ్‌ పుణె సూపర్‌ జైయింట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.